సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేసే సాయుధ పోలీసు దళం. అంతర్గత భద్రతను కాపాడటం దీని ముఖ్య లక్ష్యం. శాంతిభద్రతలను పరిరక్షించడంలో, తిరుగుబాటు కార్యకలాపాలను అణచివేయడంలో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేస్తుంది. దేశంలో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లోనూ దీన్ని వినియోగిస్తున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటుకు గుర్తుగా ఏటా జులై 27న ‘సీఆర్‌పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం’గా (CRPF Foundation Day) నిర్వహిస్తారు. ఈ దళం విశిష్టత - ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
| సీఆర్‌పీఎఫ్ చేపట్టిన ముఖ్యమైన మిషన్స్, ప్రత్యేక విభాగాలు, శౌర్య దినోత్సవంతోపాటు గతంలో ఈ టాపిక్‌పై ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ, అగ్నివీర్ ఆర్మీ ట్రేడ్స్‌మెన్ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అగిడిన ప్రశ్నలు
1. స్వాతంత్య్రానంతరం కింది ఏ సంవత్సరంలో సీఆర్‌పీఎఫ్ చట్టం అమల్లోకి వచ్చింది?
(దిల్లీ పోలీస్ కానిస్టేబుల్, 2020)
1) 1952 2) 1948 3) 1949 4) 1956
సమాధానం: 3
2. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2018)
1) బెంగళూరు 2) పుణె 3) న్యూదిల్లీ 4) భోపాల్
సమాధానం: 3
3. సీఆర్‌పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్, 2023)
1) జులై 24 2) జులై 25 3) జులై 26 4) జులై 27
సమాధానం: 4
4. క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్‌గా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఏ సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది?
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2021)
1) 1921 2) 1944 3) 1937 4) 1939
సమాధానం: 4
5. What does CRPF stand for?
(Gujarat PSI, 2025)
1) Committee Reserve Police Force 2) Central Reserve Police Force
3) Commando National Police Force 4) Committee National Police Force
Ans: 2
6. Which is the only Para Military Force in the Country which has 06 Mahila (Ladies) Battalions?
(AFCAT, 2021)
1) ITBP 2) CISF 3) CRPF 4) BSF
Ans: 3
7. Commando Battalions for Resolute Action, (CoBRA), a specialized force, are part of which of the following Central forces?
(UP Police ASI, 2021)
1) Central Reserve Police Force (CRPF) 2) National Security Guard (NSG)
3) Indo-Tibetan Border Police (ITBP) 4) Central Industrial Security Force (CISF)
Ans: 1
8. Which of the following is NOT true about the CRPF?
(UP Police Assistant Operator, 2024)
1) Participates in UN Peacekeeping Missions
2) Was originally conceived of and created in independent India
3) Performs Riot Control
4) Performs Counter Insurgency Operations
Ans: 2