కార్గిల్‌ విజయ్‌ దివస్‌

కార్గిల్‌ విజయ్‌ దివస్‌

కార్గిల్‌ యుద్ధం జమ్మూ-కశ్మీర్‌లోని కార్గిల్‌ ప్రాంత పర్వత శ్రేణుల్లో భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగిన ప్రధాన సంఘర్షణ. రెండు నెలలకు పైగా సాగిన ఈ యుద్ధంలో భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన విజయవంతంగా శత్రుమూకలను తరిమి కొట్టాయి. పాకిస్థాన్‌పై 1999 కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై 26న ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’గా నిర్వహిస్తారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులను గౌరవించుకోవడం, వారి సాహసకృత్యాలకు నివాళులు అర్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  

  • భారత్‌ నుంచి పాకిస్థాన్‌ను విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసిన 1947లోనే రెండు దేశాల మధ్య జమ్మూకశ్మీర్‌ కోసం మొదటి యుద్ధం జరిగింది. దీన్నే ‘మొదటి కశ్మీర్‌ యుద్ధం’ అంటారు. జమ్మూకశ్మీర్‌లో మూడింట రెండొంతుల భూభాగాన్ని భారత్‌ స్వాధీనం చేసుకోగా, మిగతాది పాక్‌ నియంత్రణలో ఉండిపోయింది. ఇదే పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే). దీనివల్లే నియంత్రణ రేఖ (లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ - ఎల్‌వోసీ) ఏర్పాటైంది.
  • దీర్ఘకాలంలో జమ్మూ-కశ్మీర్‌ను ఆక్రమించుకోవాలన్న పాకిస్థాన్‌ దుర్బుద్ధే కార్గిల్‌ యుద్ధానికి ముఖ్య కారణం. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం మన దేశ గెలుపును చాటడంతోపాటు బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి కారణమైంది. ఈ సంఘటన తర్వాత భారత్, పాక్‌ల మధ్య వివాదం మరింత ముదిరింది. సరిహద్దు ప్రాంతాల్లోని పర్వత శ్రేణులపై ఉన్న సైనిక స్థావరాల ద్వారా సియాచిన్‌ గ్లేసియర్‌పై నియంత్రణ కోసం రెడు దేశాలూ పోటీపడ్డాయి.
  • 1998లో రెండు దేశాలు నిర్వహించిన అణు పరీక్షలతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 1998, అక్టోబరులో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా నియమితులైన పర్వేజ్‌ ముషారఫ్‌ కశ్మీర్‌ను ఆక్రమించడానికి పథకాలు రచించాడు. దీని కోసం మొదట కార్గిల్‌ను హస్తగతం చేసుకోవాలని భావించాడు. ఎందుకంటే అది ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దాన్ని స్వాధీనం చేసుకుంటే లద్దాఖ్‌కు భారత సైన్యాన్ని తరలించే మార్గమైన జాతీయ రహదారి 1ఏ (ప్రస్తుత ఎన్‌హెచ్‌ 1)కి అంతరాయం కలిగించవచ్చు. అందుకే కార్గిల్‌ను స్వాధీనం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ దుర్బుద్ధే కార్గిల్‌ యుద్ధానికి దారితీసింది. 

చారిత్రక నేపథ్యం

1999 మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై వరకు జరిగింది. ఆపరేషన్‌ విజయ్‌ను భారత సైన్యం చేపట్టిన అత్యంత విజయవంతమైన సైనిక చర్యల్లో ఒకటిగా; మన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం, త్యాగానికి ప్రతీకగా పరిగణిస్తారు. కార్గిల్‌ యుద్ధంలో భారతదేశ విజయానికి గుర్తుగా ఏటా ఏటా జులై 26న ‘‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’’ను పాటిస్తారు.

యుద్ధం జరిగిన తీరు, యుద్ధానంతరం తీసుకున్న చర్యలు, కార్గిల్‌ యుద్ధ వీరులు కార్గిల్‌ యుద్ధ స్మారక చిహ్నం తదితర ముఖ్యాంశాలతోపాటు గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కార్గిల్‌ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్‌ పేరు?

(ఏఎఫ్‌సీఏటీ, 2018)

1) ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌        2) ఆపరేషన్‌ మేఘదూత్‌

3) ఆపరేషన్‌ టైగర్‌ హిల్‌        4) ఆపరేషన్‌ జీవన్‌ రక్షక్‌

సమాధానం: 1

2. భారత్‌ - పాక్‌ కార్గిల్‌ యుద్ధం కోడ్‌ పేరు?

(అగ్నివీర్‌ ఆర్మీ, 2025)

1) ఆపరేషన్‌ బ్లూ స్టార్‌              2) ఆపరేషన్‌ విజయ్‌

3) ఆపరేషన్‌ విరాట్‌                4) ఆపరేషన్‌ కార్గిల్‌

సమాధానం: 2

3. భారతదేశంలో ‘‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’’ను ఏ రోజున పాటిస్తారు?

(తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్‌ ఎగ్జామ్, 2023), (ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022), 

(ఎంపీటీఈటీ, 2022), (కేవీఎస్‌ పీఆర్‌టీ, 2017), (చండీగఢ్‌ పోలీస్‌ కానిస్టేబుల్, 2023), (కేరళ పీఎస్సీ సివిల్‌ ఎక్సైజ్, 2014)

1) డిసెంబరు 6    2) జులై 26            3) ఆగస్టు 24     4) మే 7

సమాధానం: 2

4. కార్గిల్‌ యుద్ధ సమయంలో భారతదేశ ప్రధాని ఎవరు?

(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2022)

1) మన్మోహన్‌ సింగ్‌                2) పీవీ నరసింహారావు

3) హెచ్‌డీ దేవెగౌడ                4) అటల్‌ బిహారీ వాజ్‌పేయీ

సమాధానం: 4

5. What was the duration of the Kargil war?
(Agniveer Army Tradesman, 2026)
1) 2 Months, 3 weeks and 2 days        2) 3 Months, 2 weeks and 2 days
3) 2 Months, 4 weeks and 2 days        4) 2 Months, 2 weeks and 2 days
Ans: 1
6. The ______ of Kargil Vijay Diwas was celebrated across India on 26 July 2018.
(DSSSB TGT Natural Science Female General Section, 2018)
1) 16th anniversary            2) 17th anniversary
3) 19th anniversary            4) 18th anniversary
Ans: 3
7. Which important day commemorating India’s victory over Pakistan was observed on 26 July 2025?
(RRB Group D, 2026)
1) Republic Day                2) Border Security Day
3) Independence Day            4) Kargil Vijay Diwas
Ans: 4

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram