ఆదాయ పన్ను అనేది ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరు. ప్రభుత్వం వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయంపై పన్ను విధిస్తుంది. ఈ విధంగా సేకరించిన మొత్తాన్ని ప్రభుత్వాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగిస్తాయి. భారతదేశంలో మొదటిసారి ఆదాయ పన్ను విధించిన రోజుకు గుర్తుగా ఏటా జులై 24న ‘ఆదాయ పన్ను దినోత్సవం’గా (Income Tax Day) నిర్వహిస్తారు. సకాలంలో పన్ను కట్టేలా ప్రోత్సహించడంతోపాటు దాని ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
|
భారతదేశంలో ముఖ్యమైన ఆదాయ పన్ను చట్టాలు, ఆర్థికమంత్రులుగా అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్ హయాంలో చేపట్టిన చర్యలు, గతంలో ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, యూజీసీ నెట్, ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్, ఆర్‌ఆర్‌సీ గ్రూప్-డి తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశంలో ఆదాయ పన్ను అనేది?
(వెస్ట్ బెంగాల్ పోలీస్ ఎస్‌ఐ, 2019)
1) పరోక్ష, ప్రగతిశీల వృద్ధికి సంబంధించింది
2) పరోక్ష, అనుపాత వృద్ధికి సంబంధించింది
3) ప్రత్యక్ష, అనుపాత వృద్ధికి సంబంధించింది
4) ప్రత్యక్ష, ప్రగతిశీల వృద్ధికి సంబంధించింది
సమాధానం: 4
2. ప్రత్యక్ష పన్నులను ప్రభుత్వం ఎవరి నుంచి వసూలు చేస్తుంది?
(ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్, 2025)
1) వ్యక్తులు, కంపెనీలు 2) దిగుమతిదారులు
3) వినియోగదారులు 4) వ్యాపారులు
సమాధానం: 1
3. భారతదేశంలో ఆదాయ పన్ను దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
(యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్, 2018)
1) జులై 21 2) జులై 22
3) జులై 23 4) జులై 24
సమాధానం: 4
4. మొదటి ఆదాయ పన్ను చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2021)
1) 1860 2) 1844 3) 1938 4) 1880
సమాధానం: 1
5. The Income Declaration Scheme was launched by the Income Tax Department of the Government of India in the year _____.
(RRC Group D, 2018)
1) 2015 2) 2014 3) 2016 4) 2013
Ans: 3
6. As per Union Budget 2025-26, under the new income tax regime, what is the tax-exempt income threshold?
(RRB Group D, 2026)
1) 12 lakh 2) 10 lakh 3) 15 lakh 4) 13 lakh
Ans: 1
7. Which of the following is NOT a change of the new Income Tax bill introduced in the Parliament during February 2025?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) Reorganisation of sections logically to facilitate ease of reference
2) Deletion of existing taxation principles, without ensuring continuity and usability
3) Elimination of intricate language to enhance readability
4) Removal of redundant and repetitive provisions for better navigation
Ans: 2