బిమ్‌స్టెక్‌ డే 

బిమ్‌స్టెక్‌ డే 

బంగాళాఖాతం ఒడ్డున లేదా ఆనుకుని ఉన్న దేశాలన్నీ కలిసి ‘బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ-సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ (బిమ్‌స్టెక్‌)’ అనే ప్రాంతీయ కూటమిగా ఏర్పడ్డాయి. వీటినే బిమ్‌స్టెక్‌ దేశాలు అంటారు. బిమ్‌స్టెక్‌ ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూన్‌ 6న ‘బిమ్‌స్టెక్‌ డే’ (BIMSTEC Day) గా నిర్వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రవాణా, పర్యాటకం, మత్స్య సంపద లాంటి రంగాల్లో వాటి మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడం, బలోపేతం చేసుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • బిమ్‌స్టెక్‌ ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉంది. బిమ్‌స్టెక్‌లో ప్రతి సభ్యదేశం నిర్దిష్ట సహకార రంగానికి నాయకత్వం వహిస్తుంది. ప్రారంభంలో (1997లో) వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రవాణా, పర్యాటకం, మత్స్య పరిశ్రమ అనే ఆరు ప్రధాన రంగాలపై సహకారాన్ని కేంద్రీకరించారు. తర్వాత దీని పరిధిని విస్తరించారు. 2008లో వ్యవసాయం, ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన, ఉగ్రవాద నిరోధం, పర్యావరణం, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు, వాతావరణ మార్పు లాంటి కొత్త రంగాలను చేర్చారు.
  • మారుతున్న ప్రపంచ కూటములు, ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బిమ్‌స్టెక్‌ వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌ (ఏడీబీ) అధ్యయనం ప్రకారం, బిమ్‌స్టెక్‌లో దేశాల మధ్య అనుసంధానాన్ని పెంచగల 167 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఈ కూటమి ఇప్పటివరకు దృష్టి సారించినవి 66 మాత్రమే ఉన్నాయి. 

చారిత్రక నేపథ్యం

1997, జూన్‌ 6న బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ బ్యాంకాక్‌ డిక్లరేషన్‌పై సంతకాలు చేసి, బిస్ట్‌ - ఎకనామిక్‌ కోపరేషన్‌ (బిస్ట్‌-ఈసీ)ను నెలకొల్పాయి. 1977, డిసెంబరు 22న మయన్మార్‌; 2004, ఫిబ్రవరిలో నేపాల్, భూటాన్‌ దేశాలు ఇందులో చేరాయి. 2004, జులై 31న బ్యాంకాక్‌లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో దీని పేరును ‘బిమ్‌స్టెక్‌’గా మార్చారు. అదే సదస్సులో ఏటా జూన్‌ 6న ‘బిమ్‌స్టెక్‌ డే’గా నిర్వహించాలని సభ్యదేశాలు తీర్మానించాయి.

బిమ్‌స్టెక్‌ సభ్యదేశాలు - నాయకత్వం వహించే సహకార రంగాలు, బిమ్‌స్టెక్‌ ప్రాముఖ్యత, ఆరో శిఖరాగ్ర సమావేశం తదితర ముఖ్యాంశాలతోపాటు ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 50కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. బిమ్‌స్టెక్‌ కూటమి ఎప్పుడు ఏర్పాటైంది?

(ఆర్‌బీఐ గ్రేడ్‌ బి, 2022)

1) 1997, జూన్‌ 6    2) 1987, జూన్‌ 6

3) 1977, జూన్‌ 6    4) 1967, జూన్‌ 6

5) 1998, జూన్‌ 6

సమాధానం: 1

2. కిందివాటిలో ఏది బిమ్‌స్టెక్‌లో సభ్యదేశం కాదు?

(ఎస్‌ఎస్‌సీ స్టెనో, 2017)

1) శ్రీలంక      2) బంగ్లాదేశ్‌

3) థాయ్‌లాండ్‌   4) చైనా

సమాధానం: 4

3. 2025, ఏప్రిల్‌ 4న థాయ్‌లాండ్‌లో జరిగిన ఎన్నో బిమ్‌స్టెక్‌ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2025)

1) 6వ    2) 7వ   3) 8వ   4) 9వ

సమాధానం: 1

4. బిమ్‌స్టెక్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) కాఠ్‌మాండూ       2) న్యూదిల్లీ

3) కొలంబో          4) ఢాకా

సమాధానం: 4

5. Where was the BIMSTEC Summit held in April 2025?
(SSC CHSL, 2025)
1) India        2) Bangladesh    3) Bhutan        4) Thailand
Ans: 4
6. What is the theme of the 6th BIMSTEC Summit?
(DSSSB LDC (Jr. Assistant/ Steno/ LDC), 2025)
1) “BIMSTEC – Towards Sustainable Development”
2) “BIMSTEC – Prosperous, Resilient and Open”
3) “BIMSTEC – Unity in Diversity”
4) “BIMSTEC – Future Prosperity”
Ans: 2
7. Which one of the following country is not a member of BIMSTEC?
(UP PGT (Civics), 2021)
1) Bangladesh    2) India        3) Thailand        4) Spain
Ans: 4

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram