పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా (World Environment Day) నిర్వహిస్తారు. పర్యావరణ సమస్యలు, సవాళ్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఇదే రోజున ఏర్పాటైంది.
పర్యావరణం అంటే?
పర్యావరణ కారకాలు..
నిర్జీవ కారకాలు: పర్యావరణంలో ప్రాణం లేని భౌతిక, రసాయన కారకాలను నిర్జీవ కారకాలు అంటారు.
జీవ కారకాలు: ఇందులో ఆవరణ వ్యవస్థలోని అన్ని జీవులు ఉంటాయి.
పర్యావరణ క్షీణత..
చారిత్రక నేపథ్యం:
యూఎన్‌ఓ ఆధ్వర్యంలో 1972, జూన్ 5 - 16 మధ్య స్టాక్‌హోం (స్వీడన్)లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు జూన్ 5న ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)’ను ఏర్పాటు చేశారు. దీనికి గుర్తుగా 1973 నుంచి ఏటా ఆ తేదీన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మొదటిసారి ఎప్పుడు నిర్వహించారు?
(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ సీఆర్‌ఈ, 2025), (ఆర్‌బీఐ గ్రేడ్ బి, 2022),
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021), (హెచ్‌టీఈటీ పీఆర్‌టీ, 2021)
1) 1992 2) 1985 3) 2003 4) 1973
సమాధానం: 4
2. పర్యావరణం కింది దేంతో రూపొందింది?
(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2023)
1) భూస్వరూప అంశాలు
2) నిర్జీవ అంశాలు
3) జీవ సంబంధిత అంశాలు
4) భూస్వరూప, జీవ సంబంధిత, నిర్జీవ అంశాలు
సమాధానం: 4
3. పర్యావరణం (ఎన్విరాన్మెంట్) అనే పదానికి అర్థం ఏమిటి?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పీఆర్‌టీ, 2018)
1) జీవరాశులు 2) చుట్టుపక్కల
3) జీవుల మధ్య పరస్పర సంబంధం
4) వాతావరణ పరిస్థితులు
సమాధానం: 2
4. పర్యావరణ అధ్యయనంలో కింది ఏది భాగంగా ఉంటుంది?
(త్రిపుర టెట్ 2018)
1) ఆవరణశాస్త్రం 2) భౌతికశాస్త్రం
3) రసాయనశాస్త్రం 4) పైవన్నీ
సమాధానం: 4
5. పర్యావరణం కింది ఏ రెండు అంశాలను కలిగి ఉంటుంది?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ ఎన్‌డీఎంసీ పీఆర్‌టీ, 2022)
1) సహజ, సామాజిక 2) సహజ, కృత్రిమ
3) దైవదత్త, కృత్రిమ 4) సహజ, మానవనిర్మిత
సమాధానం: 1
6. Which out of the given options are environmental concerns?
i. Conservation of water
ii. Disposal of waste
iii. Increase of Population
(HTET PRT 2015)
1) i and ii 2) i 3) ii and iii 4) i, ii and iii
Ans: 3
7. Some organisms can tolerate and thrive in a wide range of temperature, they are called
(UP TGT Biology 2016)
1) Stenothermal
2) Homeothermal
3) Poikilothermal
4) Eurythermal
Ans: 4
8. Which is not the aim of environment study?
(Official Paper 4: OTET 2017)
1) To analyse environment
2) To pollute environment
3) To protect environment
4) To identify learning technique of environment
Ans: 2