వరల్డ్‌ హంగర్‌ డే

వరల్డ్‌ హంగర్‌ డే

సరిపడినంత కేలరీల ఆహారం లేకపోవడాన్ని ఆకలి అంటారు. ప్రపంచవ్యాప్తంగా నేటికీ అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఆకలికి ప్రధాన కారణం పేదరికమే. ఆదాయ అసమానతలు, వనరుల కొరత కారణంగా ఆయా దేశాల్లోని కోట్లాది ప్రజలు పోషకాహారాన్ని పొందలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యను అంతం చేసే లక్ష్యంతో ఏటా మే 28న ‘వరల్డ్‌ హంగర్‌ డే’గా నిర్వహిస్తారు. యునైటెడ్‌ నేషన్స్‌ (యూఎన్‌) 2015-30 కాలానికి రూపొందించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది ‘జీరో హంగర్‌’. అంటే ఆకలిని అంతమొందించడం, ఆహార భద్రతను సాధించడం, పోషకత్వ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఆకలి అంటే?

  • ఆహారం లేకపోవడం వల్ల శరీరానికి కలిగే అసౌకర్యం లేదా బలహీనతను ఆకలి అంటారు. ఇందులో దీర్ఘకాలిక ఆకలి, తీవ్రమైన అకలి అని రెండు రకాలు ఉంటాయి.
  • వ్యక్తులు తమ శక్తి అవసరాలు తీర్చడానికి తగినన్ని కేలరీలు తీసుకోకపోవడాన్ని దీర్ఘకాలిక ఆకలి అంటారు. పేదరికం ఉన్న కుటుంబాల్లో ఇది సర్వసాధారణం.
  • ఆకస్మికంగా, తీవ్ర ఆహార కొరత ఏర్పడటాన్ని తీవ్రమైన ఆకలిగా పేర్కొంటారు. ప్రకృతి వైపరీత్యాలు, సంఘర్షణలు, ఆర్థిక సంక్షోభాలు, కరవు వల్ల ఇది సంభవిస్తుంది.
  • ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ప్రకారం, ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన, ఉత్పాదక జీవితాన్ని గడపడానికి అవసరమైన కనీస ఆహారం లభించని స్థితే ఆకలి. చాలా తక్కువ మొత్తంలో కేలరీలు తీసుకోవడాన్ని కూడా ఎఫ్‌ఏఓఆకలిగా పేర్కొంది. 

రెండో సుస్థిరాభివృద్ధి లక్ష్యం - జీరో హంగర్‌ (ఆకలిని నిర్మూలించడం)

  • సురక్షితమైన పౌష్టికాహారాన్ని అందరికీ తగినంతగా అందుబాటులో ఉంచి, 2030 నాటికి ఆకలిని నిర్మూలించాలని రెండో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది.  దీని ప్రకారం..
  • అయిదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు (Stunting) ఎత్తుకు తగిన బరువు (Wasting) లేకపోవడం లాంటి అంశాల్లో అంతర్జాతీయ అంగీకార లక్ష్యాలను చేరుకోవాలి. 2025 నాటికి ఎత్తు తక్కువతో బాధపడుతున్న పిల్లల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని, శారీరక బరువు సరిగాలేని వారి సంఖ్యను 5 శాతంలోపునకు తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
  • 2030 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను, చిన్న-కౌలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి.
  • 2001 నవంబరులో ఖతార్‌లోని దోహాలో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ఓ సమావేశాన్ని నిర్వహించింది. దీన్నే దోహా రౌండ్‌గా పేర్కొంటారు. ఇందులో వ్యవసాయ ఎగుమతుల సబ్సిడీలను తొలగించాలని; ప్రపంచ వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న వాణిజ్యపరమైన షరతులు, ఆటంకాలను ఎత్తివేయాలని తీర్మానించారు.
భారతదేశంలో ఆకలికి కారణాలు, గ్లోబల్‌ రిపోర్ట్‌ ఆన్‌ ఫుడ్‌ క్రైసిస్‌ 2026, ప్రపంచ ఆకలి సూచీ - 2026, భారతదేశంలో ఆకలి నిర్మూలన కార్యక్రమాలు తదితర సమాచారంతో పాటు ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ లాంటి పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

 గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?

(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ ప్రహారీ, 2023)

1) 2007    2) 2005            3) 2010    4) 2013

సమాధానం: 4

2. ‘వరల్డ్‌ హంగర్‌ డే’ను ఎప్పుడు పాటిస్తారు?

(అలహాబాద్‌ హైకోర్ట్‌ ఆర్‌ఓ, 2021)

1) మే 25    2) మే 26        3) మే 27    4) మే 28

సమాధానం: 4

 3. India was ranked what in the Global Hunger Index 2024?
(SSC CHSL 2025)
1) 75th        2) 95th        3) 125th        4) 105th
Ans: 4
4. With reference to the Zero Hunger Programme, consider the following statements:
I. India’s ambitious Zero Hunger Programme through interventions in the farm sector was launched with a focus on agriculture, nutrition and health.
II. This is a dedicated farm-based programme in synchronization with Sustainable Development Goals (SDGs) to end hunger by 2030.
III. This programme is an initiative of the Indian Council of Agricultural Research.
Which of the above statements is/are correct?
(Punjab Civil Service 2018)
1) I only        2) II and III only        3) I and II only        4) I, II and III
Ans: 4
5. In the Global Hunger Index, which indicator carries the highest weight in measuring hunger and under nutrition among children and populations in countries worldwide?
(Delhi Police Constable 2026)
1) Child wasting            2) Child mortality
3) Child stunting            4) Undernourishment
Ans: 3
6. In which of the following global indices released in the year 2019 did India secure the 102nd rank among 117 countries?
(SSC JE EE 2020)
1) Global Competitiveness Index        2) Democracy Index
3) Ease of Doing Business            4) Global Hunger Index
Ans: 4

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram