సినిమాలకు రేటింగ్స్ ఇచ్చే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఒక్కో ఏడాదిలో విశేష ఆదరణ పొందిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తమకున్న 250 మిలియన్లకుపైగా యూజర్లు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా దీన్ని రూపొందించింది. తమ వినియోగదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి, ఏ సినిమాపై ఎక్కువ ఆసక్తికనబరిచారు? క్రేజ్ పరంగా ఏ హీరో ఏ స్థానంలో ఉన్నారు? తదితర వివరాల్ని వెల్లడిస్తూ ఒకేసారి 26 ఏళ్ల సినిమాలకు సంబంధించిన నివేదికను రూపొందించింది. 2000 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు వరకు.. ఒక్కో ఏడాదిలో విశేష ఆదరణ పొందిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. అంటే.. ఏడాదికి 5 సినిమాల చొప్పున 26 ఏళ్లకుగానూ 130 చిత్రాలు టాప్‌లో ఉన్నాయి.