జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2025, సెప్టెంబరు 30న ‘ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక-2023’ను విడుదల చేసింది. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (4,151), కర్ణాటక (2,423) తర్వాత ఏపీ (925) మూడో స్థానంలో ఉంది.
దేశవ్యాప్తంగా 2023లో 10,786 మంది రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడగా... అందులో 8.57 శాతం ఏపీ వారే.
మొత్తం 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత రాష్ట్రాల్లో రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2023లో దేశవ్యాప్తంగా అన్నిరంగాలకు సంబంధించిన ఆత్మహత్యల్లో (1,71,418) రైతులు, రైతుకూలీల వాటా 6.3%గా ఉంది.
2023లో దేశవ్యాప్తంగా అన్నదాతల మరణాల వివరాలు
సంఖ్య | రాష్ట్రం | సంఖ్య |
1 | మహారాష్ట్ర | 4,151 |
2 | కర్ణాటక | 2,423 |
3 | ఆంధ్రప్రదేశ్ | 925 |
4 | మధ్యప్రదేశ్ | 777 |
5 | తమిళనాడు | 631 |
6 | ఛత్తీస్‌గఢ్ | 468 |
7 | ఉత్తర్‌ప్రదేశ్ | 357 |
8 | రాజస్థాన్ | 250 |
9 | పంజాబ్ | 174 |
10 | గుజరాత్ | 141 |
11 | కేరళ | 132 |
12 | తెలంగాణ | 56 (14వ స్థానం) |