ఖడ్గమృగాలు, ఏనుగులకు ప్రసిద్ధి చెందిన అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్కు.. ఎన్నో కీటక జాతులకు పుట్టినిల్లని ఓ అధ్యయనంలో తేలింది. కీటకాలు, సాలె పురుగుల వంటి కనీసం 283 రకాల జీవజాతులకు కాజీరంగా నిలయంగా ఉన్నట్లు ‘‘ఎక్స్‌ప్లొరేటివ్ స్టడీ ఆఫ్ ఇన్‌సెక్ట్స్ అండ్ స్పైడర్స్ ఆఫ్ ద వుడ్‌ల్యాండ్ హబిటాట్ ఆఫ్ కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్’ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
దీని ప్రకారం.. 29 రకాల సాలె పురుగులు, 85 రకాల సీతాకోకాచిలుకలు, చిమ్మెటలు, 40 రకాల చీమలు, తేనెటీగలు, కందిరీగలు, వివిధ రకాల పురుగులు ఇక్కడ ఉనికిలో ఉన్నాయి.