ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదకారిగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025, సెప్టెంబరు 23న విడుదల చేసిన ‘గ్లోబల్ హైపర్ టెన్షన్ నివేదిక’ స్పష్టం చేసింది. 2024 నాటికి 140 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతుండగా, ప్రతి ఐదుగురిలో ఒక్కరిలో మాత్రమే ఇది నియంత్రణలో ఉంటోందని ఈ నివేదిక వెల్లడించింది.
భారత్‌లో 30 నుంచి 79 ఏళ్ల వయస్కుల్లో అధిక రక్తపోటు కేవలం 17 శాతం మందిలోనే నియంత్రణలో ఉందని నివేదిక పేర్కొంది.