ప్రపంచ ‘టాప్ 2% శాస్త్రవేత్తల’ జాబితాలో భారత్ నుంచి 3,372 మంది చోటు దక్కించుకున్నారు.
అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం గత ఏడేళ్లుగా ఈ జాబితాను విడుదల చేస్తోంది. 2025 జాబితాను తాజాగా ప్రచురించింది.
శాస్త్రవేత్తలు, ఆచార్యులు ప్రచురించిన పరిశోధనా పత్రాలను ఇతరులు చదివి... తమ పరిశోధనల్లో వాటిని ఎన్నిసార్లు ప్రస్తావించారన్న అంశం (సైటేషన్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రధానంగా 22 రంగాలు, 174 ఉప రంగాలకు రెండు రకాల జాబితాలను విడుదల చేశారు.
దేశంలో 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు ఉన్నాయి. ఈసారి ‘టాప్ 2% శాస్త్రవేత్తల’ జాబితాలో ఐఐటీల నుంచి 755 మంది, ఎన్‌ఐటీల నుంచి సుమారు 330 మంది ఎంపికయ్యారు.