2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల ఆర్థిక స్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆఫ్ ఇండియా కె. సంజయ్ మూర్తి 2025, సెప్టెంబరు 19న నివేదిక విడుదల చేశారు.
దేశ జీడీపీలో 50% పైగా 15 నగరాల నుంచే వస్తోందని నివేదిక వెల్లడించింది.
ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలు భారత జీడీపీలో 30 శాతాన్ని అందిస్తున్నాయని, ఏటా జీడీపీ వృద్ధికి 1.5 శాతాన్ని జత చేస్తున్నాయని పేర్కొంది.