తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక వెల్లడించింది. 2020-21 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో చిక్కుకున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో ఏపీ 1, తెలంగాణ 2వ స్థానాల్లో నిలిచాయి.
ఏపీలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో 92.3% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం(ఫైనాన్షియల్ ఇంక్లూజన్) అయ్యారు. ఈ విషయంలో కర్ణాటక(95.9%) తర్వాతి స్థానాన్ని ఏపీ ఆక్రమించింది. తెలంగాణలో 86.5% మందే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారు. ఈ విషయంలో దేశంలోని పెద్దరాష్ట్రాల్లో 14వ స్థానంలో తెలంగాణ ఉంది.