ఐక్యరాజ్య సమితి 2025, అక్టోబరు 22న గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్‌మెంట్-2025 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడో స్థానాన్ని నిలుపుకొంది. 2024లో మన దేశం పదో స్థానంలో ఉంది. వార్షిక వృద్ధిలో చైనా, రష్యాల తర్వాతి స్థానాన్ని భారత్ ఆక్రమించింది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4.14 బిలియన్ హెక్టార్ల (32 శాతం) అటవీ ప్రాంతముందని నివేదికలో పేర్కొంది. దీనిలో సగానికి(54 శాతం) పైగా రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనాల్లో కేంద్రీకృతమైంది. ఆస్ట్రేలియా, కాంగో, ఇండోనేసియాలను అనుసరిస్తూ మొదటి 10 అటవీ సంపన్న దేశాల్లో భారత్ కూడా నిలిచింది.