2023 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు దేశవ్యాప్తంగా జిల్లాలవారీగా నమోదైన జనన, మరణాల వివరాలతో ‘పౌర నమోదు వ్యవస్థ (సీఆర్‌ఎస్)’ తాజా నివేదికను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. దేశంలో ఎక్కడ జనన, మరణాలు సంభవించినా 21 రోజుల్లోగా సీఆర్‌ఎస్‌లో ప్రజలు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం,
2023లో తెలంగాణలో 6,52,688 జననాలు నమోదవగా, ఆంధ్రప్రదేశ్‌లో 7,62,093 జననాలు నమోదయ్యాయి.
రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో లక్షకుపైగా జననాలు నమోదు కాగా.. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఆ సంఖ్య వెయ్యి కూడా దాటలేదు. సిక్కింలోని నార్త్ (మంగన్) జిల్లాలో 57 జననాలు నమోదయ్యాయి.