వాతావరణ మార్పులతో చోటుచేసుకునే అనారోగ్య సమస్యల కారణంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 2050 నాటికి 1.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.131 లక్షల కోట్లు) ప్రతికూల ప్రభావం పడే ముప్పు ఉందని డబ్ల్యూఈఎఫ్ (ప్రపంచ ఆర్థిక వేదిక) నివేదిక తెలిపింది.
నాలుగు అత్యంత ప్రభావిత ఆర్థిక రంగాలు - ఆహారం - వ్యవసాయం; బిల్ట్ ఎన్విరాన్‌మెంట్; ఆరోగ్యం - ఆరోగ్య సంరక్షణ; బీమాపై వాతావారణ ఆధారిత ఆరోగ్య సమస్యల ప్రభావాన్ని మదింపు చేస్తూ డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను రూపొందించింది.
నివేదిక అంచనా వేసిన 1.5 లక్షల కోట్ల డాలర్ల ప్రభావం తొలి మూడు రంగాల్లో నష్టానికి సంబంధించిందేనని.. మొత్తం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై భారం ఇంకా అధికంగానే ఉండొచ్చని వివరించింది.