2025 లింక్డ్‌ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా జాబితా ప్రకారం, దేశంలో అగ్రగామి అంకుర సంస్థగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో నిలిచింది. వరుసగా మూడో ఏడాదీ జెప్టో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఎంటర్‌ప్రైజ్ క్లౌడ్ స్టోరేజ్ సంస్థ లుసిడిటీ రెండో స్థానంలో, 10 నిమిషాల్లో ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విష్ మూడో స్థానంలో ఉన్నాయి. వీక్‌డే 4వ స్థానంలో, జార్ (5), కాన్విన్ (6), భాంజు (7), రిఫైన్ ఇండియా (8), ఇమోటోరాడ్ (9), అట్లిస్ 10వ స్థానంలో ఉన్నాయి.