ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక
  • అసంఘటిత రంగ సంస్థల వార్షిక సర్వే-2025 ఆధారంగా ఎస్‌బీఐ రిసెర్చ్‌ తాజా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలో అసంఘటిత రంగ సంస్థల రూపురేఖలను డిజిటలీకరణ అనూహ్యంగా మారుస్తోందని.. సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా ఈ సంస్థల కార్మిక ఉత్పాదకత భారీగా పెరగడమే కాకుండా, సంఘటిత వ్యవస్థలోకి మారే ప్రక్రియ వేగవంతం అవుతోందని ఇది వెల్లడించింది. ఈ నివేదిక, జాతీయ స్థాయి గణాంకాలతో పాటు, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల పనితీరు మెరుగవ్వడాన్నీ స్పష్టం చేసింది. 
  • సాంకేతికతను స్వీకరించడంతో, అసంఘటిత కార్మికుల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. ఐసీటీ (ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ) సూచీలో ఒక పర్సంటేజీ పాయింట్‌ పెరుగుదల నమోదైతే, కార్మిక ఉత్పాదకత ఏకంగా 76% పెరుగుతున్నట్లు ఎస్‌బీఐ పరిశోధనలో తేలింది. ఉత్పాదకతను పెంచడంలో సాంకేతికతతో పాటు, సంస్థల అనుభవం 11%, మూలధనం 7% మేర వృద్ధికి దోహదం చేస్తున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram