దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సూర్యరశ్మి పడే సమయం తగ్గిపోతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. హిమాలయ రాష్ట్రాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో గరిష్ఠంగా వరుసగా ఏడాదికి సగటున 9.5 గంటలు, 8.5 గంటల ఎండ పడే సమయం తగ్గిపోయిందని పేర్కొంది. 1988-2018 మధ్య 20 వాతావరణ కేంద్రాల్లో ఉన్న డేటాను విశ్లేషించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ, భారత వాతావరణ విభాగం ఇందులో పాలుపంచుకున్నాయి.
ఆ వివరాల ప్రకారం.. దక్కన్ ప్రాంతంలో సూర్యరశ్మి సమయం ఏడాదికి 3 గంటలు తగ్గిపోగా.. ఉత్తరభారతంలో ఇది 1.5 గంటలుగా ఉంది.