మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ప్రపంచంలో అత్యుత్తమ 100 బీ స్కూళ్లలో బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా ఐఐఎంలు చోటు సంపాదించాయి.
లండన్‌కు చెందిన క్యూఎస్ గ్లోబల్ ఎంబీఏ, ఆన్‌లైన్ ఎంబీఏ అండ్ బిజినెస్ మాస్టర్స్ ర్యాంకింగ్స్-2026 పేరుతో ఈ ర్యాంకింగ్స్ విడుదల చేసింది.
దీనిప్రకారం 2024లో 53వ స్థానంలో ఉన్న ఐఐఎం బెంగళూరు ఒక స్థానం మెరుగుపరుచుకొని 52వ ర్యాంక్‌లో నిలిచింది.
ఐఐఎం అహ్మదాబాద్ రెండు స్థానాలు ఎగబాకి 58వ స్థానం సాధించింది. ఐఐఎం కోల్‌కతా 64వ ర్యాంక్ చేజిక్కించుకుంది.