వచ్చే పదేళ్లలో అంతర్జాతీయ పర్యాటక, ఆతిథ్య రంగంలో 9.1 కోట్ల కొత్త ఉద్యోగాలు రావొచ్చని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) నివేదికలో పేర్కొంది. అంటే అంతర్జాతీయంగా వచ్చే ప్రతి మూడు కొత్త ఉద్యోగాల్లో ఒకటి ఈ రంగంలోనే ఉంటుందని తెలిపింది. భౌగోళిక, నిర్మాణాత్మక మార్పులతో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించకపోతే 2035 నాటికి 4.3 కోట్ల మందికి పైగా శ్రామికశక్తి కొరత ఏర్పడుతుందని పేర్కొంది.
‘ఫ్యూచర్ ఆఫ్ ది ట్రావెల్ అండ్ టూరిజం వర్క్‌ఫోర్స్’ పేరిట ఈ నివేదికను డబ్ల్యూటీటీసీ వెలువరించింది.