ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదేళ్లలో దట్టమైన అటవీ విస్తీర్ణం నాలుగు రెట్లకుపైగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘ఎన్విరాన్‌మెంటల్ ఎకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్-2025’ లెక్కలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2013-14లో రాష్ట్రంలో దట్టమైన అటవీ విస్తీర్ణం 375 చదరపు కిలోమీటర్లు. 2021-22కు అది 1,995.71 చ.కి.మీ.లకు చేరింది. 1,620.71 చ.కి.మీ. నికర వృద్ధి (432.19%) నమోదైంది. ఇదివరకటి మదింపు కాలం (ఎసెస్‌మెంట్ పీరియడ్)లో మధ్యస్థాయిలో ఉన్న అడవులు తర్వాత దట్టంగా రూపాంతరం చెందడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది.