ఆంధ్రప్రదేశ్‌లోని 0-6 ఏళ్ల వయసు చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి ‘నవచేతన’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పిల్లల్లో మానసిక ఎదుగుదల తీరును కృత్రిమ మేధ ద్వారా గుర్తించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామన్నారు.