దక్షిణ కోస్తా జోన్‌

దక్షిణ కోస్తా జోన్‌
  • విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రంలో రైల్వే పరిధి అంతా కలిపి ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్‌.. 3,532 కిలోమీటర్ల మేర ఉండనుంది. దీన్ని రూట్‌ కిలోమీటర్లుగా పేర్కొంటారు. ఇక డబుల్‌లైన్, త్రిబుల్‌ లైన్‌ తదితరాలు అన్నీ కలిపితే ట్రాక్‌ 6,454 కి.మీ. మేర ఉంటుంది. కొత్త జోన్‌లో అధికారిక కార్యకలాపాలు 2026, జూన్‌ 1 నుంచి మొదలవుతాయి.
  • ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ కోత్త జోన్‌లోకి వస్తాయి. తూర్పుకోస్తా రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్‌ ఉండగా, దీని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్‌ ఏర్పాటు చేశారు. ఇది కూడా కొత్త జోన్‌లోకి వస్తుంది. దీంతో మొత్తం నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా జోన్‌ ఉంటుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram