చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై ప్రభుత్వం యథాతథ స్థితిని కొనసాగించింది. అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు, ప్రజా భవిష్య నిధి, జాతీయ పొదుపు పత్రంతో పాటు ఇతర పొదుపు పథకాలపై పాత వడ్డీ రేట్లే వర్తించనున్నాయి. గత ఏడు త్రైమాసికాలుగా ప్రభుత్వం వీటిల్లో సవరణ చేయలేదు. వివిధ పథకాలపై ఎంత వడ్డీ వర్తిస్తుందో పరిశీలిస్తే..
సుకన్య సమృద్ధి యోజన - 8.2%
మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం - 7.1%
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) - 7.1 %
పోస్టాఫీసు పొదుపు డిపాజిట్ పథకం - 4%