మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోని అత్యంత విలువైన తొలి 10 వాహన తయారీ సంస్థల్లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ)కు స్థానం దక్కింది. సంస్థ మార్కెట్ విలువ 57.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.5.11 లక్షల కోట్ల)కు చేరడమే ఇందుకు కారణం.
ఈ క్రమంలో ఫోక్స్‌వ్యాగన్ (55.7 బి.డాలర్లు), జనరల్ మోటార్స్ (57.1 బి.డాలర్లు), ఫోర్డ్ (46.3 బి.డాలర్లు) తో పాటు జపాన్ మాతృసంస్థ సుజుకీ మోటార్ (28.34 బి.డా.)లను ఎంఎస్‌ఐ వెనక్కి నెట్టింది.