డబ్ల్యూఈఎఫ్‌ అంచనాలు

డబ్ల్యూఈఎఫ్‌ అంచనాలు

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలహీన వృద్ధి దశలోకి అడుగుపెడుతోందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తాజాగా విడుదల చేసిన ‘చీఫ్‌ ఎకనమిస్ట్స్‌ అవుట్‌లుక్‌’లో పేర్కొంది. 2025లో భారత్‌ 6.5% వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. దేశ తయారీ లక్ష్యాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌లు అడ్డంకిగా మారనున్నాయని తెలిపింది. ఈ పరిణామం దక్షిణాసియా మొత్తం మీద ప్రభావం చూపుతుందని తెలిపింది. ఈ సర్వే ప్రకారం..

2026లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని 72% మంది ముఖ్య ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. వర్థమాన దేశాల్లో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా(మెనా), దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాలు వృద్ధికి ప్రధాన చోదకాలుగా నిలవగలవు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram