భారతదేశ రక్షణ, వ్యూహాత్మక అవసరాల కోసం అత్యాధునిక ఎయిర్‌షిప్‌లు తయారు చేసేందుకు ఫ్రెంచ్- కెనడియన్ సంస్థ ఫ్లైయింగ్ వేల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ ఫోర్జ్ లిమిటెడ్ తెలిపింది. యూకేలో జరిగిన ఫార్న్‌బరో ఇంటర్నేషనల్ ఎయిర్‌షో-2026లో అవగాహనా ఒప్పంద పత్రాలపై భారత్ ఫోర్జ్ సీఈఓ (ఏరోస్పేస్) గురు బిశ్వాల్, ఫ్లైయింగ్ వేల్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ బౌగన్ సంతకాలు చేశారు.