సెప్టెంబరుతో ముగిసిన 2024-25 మార్కెటింగ్ సీజన్‌లో మన దేశం 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేసినట్లు ఆలిండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ (ఏఐఎస్‌టీఏ) వెల్లడించింది. ఏటా అక్టోబరు-సెప్టెంబరు మధ్య చక్కెర మార్కెటింగ్ సీజన్ నడుస్తుంది. 2024-25 మార్కెటింగ్ సీజన్ కోసం చక్కెర ఎగుమతులను 2025 జనవరి 20న అనుమతించారు. గత ఏడాది 10 లక్షల టన్నుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.