2025-26లో జీడీపీ వృద్ధి 7.7%

2025-26లో జీడీపీ వృద్ధి 7.7%
  • గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశ వృద్ధిరేటు (జీడీపీ) 7.7 శాతంగా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. 2024-25 వృద్ధిరేటు 7.1 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ. 2025-26లో స్థూల విలువ జోడింపు (రియల్‌ జీవీఏ) 7.9% వృద్ధిని సాధించింది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2026, జూన్‌ 5న విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025-26 నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో జీడీపీ వృద్ధి 7.8%, జీవీఏ 7.9 శాతంగా నమోదైంది. 2025-26లో స్థిర ధరల వద్ద వాస్తవ జీడీపీని రూ.323.12 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram