ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో ఇషా అనిల్ తక్సలె, హిమాంశులతో కూడిన జట్టు స్వర్ణం నెగ్గింది. 2025, సెప్టెంబరు 30న జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత జట్టు బంగారు పతకం సాధించింది.
ఈ పోటీల్లో ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలతో సహా మొత్తం 23 పతకాలతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.