టీమ్‌ఇండియా తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. 2025, సెప్టెంబరు 28న దుబాయ్‌లో జరిగిన టీ20 టోర్నీ ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’, కుల్‌దీప్ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా నిలిచారు.
1984లో తొలి ఆసియాకప్‌లో విజేతగా నిలిచిన భారత్.. తర్వాత 1988, 1990, 1995, 2010, 2016, 2018, 2023, 2025లో కప్ నెగ్గింది.