దిల్లీలో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీలో శీతల్ దేవి వ్యక్తిగత విభాగంలో స్వర్ణంతో పాటు టీమ్‌లో రజతం, మిక్స్‌డ్‌లో కాంస్యాన్ని సొంతం చేసుకుంది. రెండు చేతులు లేకపోయినా వ్యక్తిగత పసిడి గెలుచుకున్న తొలి మహిళ ఆర్చర్‌గా శీతల్ రికార్డు సృష్టించింది.
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో 146-143తో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ క్యూర్ గిర్డి (తుర్కియే)ను ఓడించి పసిడి సొంతం చేసుకుంది.
మహిళల టీమ్ ఈవెంట్లో శీతల్-సరిత ద్వయం రజతం గెలుచుకుంది. ఫైనల్లో శీతల్ జోడీ 148-152తో క్యూర్ గిర్డి-బర్సా ఫత్మా (తుర్కియే) జంట చేతిలో ఓడింది.