ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్-19 బాలికల డబుల్స్‌లో దివ్యాంశి బౌమిక్-సిండ్రెలా దాస్ జంట నంబర్‌వన్ ర్యాంకు సాధించింది. 3910 పాయింట్లతో భారత ద్వయం అగ్రస్థానంలో నిలిచింది. వుజియా-వు యింగ్ (చైనీస్ తైపీ, 3195), లీనా-జెంగ్ (ఫ్రాన్స్, 3170) జంటలు వరుసగా రెండు, మూడో ర్యాంకులు దక్కించుకున్నాయి.
భారత టీటీలో యూత్ విభాగంలో ఒక డబుల్స్ జోడీ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి.