ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ తన్వి శర్మ (16 ఏళ్లు) రజతం నెగ్గింది. 2025, అక్టోబరు 19న గువాహటిలో జరిగిన బాలికల సింగిల్స్ తుది పోరులో తన్వి 7-15, 12-15తో అన్యాపత్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది.
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్‌లో 17 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన పతకమిది.