ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ టోర్నీలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంస్యం నెగ్గింది. 2025, అక్టోబరు 18న నాన్‌జింగ్ (చైనా)లో జరిగిన కాంపౌండ్ మహిళల సింగిల్స్ కాంస్య పోరులో సురేఖ 150-145తో ఎలా గిబ్సన్ (బ్రిటన్)ను ఓడించింది. ఈ పోరులో ఆమె వరుసగా 15 సార్లు ఫర్‌ఫెక్ట్ టెన్ స్కోరు చేసింది.
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ టోర్నీలో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.