ప్రపంచ షాట్‌గన్ ఛాంపియన్‌షిప్‌లో భారత వెటరన్ షూటర్ జొరావర్ సంధు (48 ఏళ్లు) కాంస్యం సాధించాడు. 2025, అక్టోబరు 17న ఏథెన్స్‌లో జరిగిన ఫైనల్లో సంధు 31 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. జోసిప్ గ్లాస్‌నోవిచ్ (క్రొయేషియా, 44) స్వర్ణం.. అండ్రెస్ గర్సియా (స్పెయిన్, 39) రజతం గెలుచుకున్నారు.
టీమ్ విభాగంలో సంధు, వివాన్ కపూర్, బౌనీష్‌లతో కూడిన భారత జట్టు (352 పాయింట్లు) పదో స్థానంలో నిలిచింది.