ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఈషా సింగ్ స్వర్ణం నెగ్గింది. 2026, జులై 27న హాంగ్జౌలో జరిగిన 25మీ. పిస్టల్‌లో 40 హిట్స్‌తో ఫైనల్లో విజేతగా నిలిచింది. ఇదే ఈవెంట్లో మను బాకర్ కాంస్య పతకం గెలుచుకుంది. 28 హిట్స్‌తో పాక్ హ్యోన్ గ్యోంగ్ (ఉత్తర కొరియా)తో సమంగా నిలిచిన మను.. షూటాఫ్‌లో నెగ్గి మూడో స్థానం సాధించింది.