కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్‌లో 65 కేజీల ఈవెంట్లో రాజా ముత్తుపాండి రజతం గెలవగా.. మహిళల 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ అదే పతకం అందుకుంది. 58 కేజీల్లో బింద్యారాణి కాంస్యం సాధించింది. 2026, జులై 27న గ్లాస్గోలో జరిగిన క్రీడల్లో వీరు పతకాలు నెగ్గారు. భారత్ ఈ కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన ఆరు పతకాల్లో.. అయిదు వెయిట్‌లిఫ్టర్లు సాధించగా, ఒకటి పారా పవర్‌లిఫ్టర్ గెలిచాడు.