భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించింది. 2026, జులై 26న గ్లాస్గోలో జరిగిన స్నాచ్‌లో 85 కేజీలు ఎత్తిన మీరా.. క్లీన్ అండ్ జెర్క్ 105 కేజీలు మోసి, మొత్తంగా 190 కేజీలతో అగ్రస్థానం సాధించింది. అసుకో న్యాంగ్ (168, నైజీరియా) రజతం గెలవగా, జేన్ హెన్రీ (167, మలేసియా) కాంస్యం నెగ్గింది.
మీరాబాయి చానుది మణిపుర్. కామన్వెల్త్ క్రీడల్లో మొత్తంగా మీరాకిది నాలుగో పతకం. 2014లో రజతం గెలిచిన మీరాబాయి.. తర్వాత వరుసగా మూడు క్రీడల్లోనూ పసిడి సాధించింది.