కామన్వెల్త్ క్రీడల్లో భారత పారాఅథ్లెట్ ఝండూ కుమార్ పురుషుల హెవీవెయిట్ పవర్‌లిఫ్టింగ్‌లో (190 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గాడు. బిహార్ చెందిన ఇతడు 2026, జులై 25న జరిగిన ఫైనల్లో 130.9 పాయింట్లు సాధించాడు.
ఝండూ కేవలం రెండు పాయింట్ల తేడాతో స్వర్ణం కోల్పోయాడు. నైజీరియాకు చెందిన ఇద్రిస్ రిలువాన్ (132.8) పసిడి కైవసం చేసుకోగా.. మ్యాథ్యూ హార్డింగ్ (131) రజతం గెలిచాడు.