భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గింది.
2025, సెప్టెంబరు 18న జాగ్రెబ్‌లో జరిగిన మహిళల 53 కిలోల విభాగంలో ఆమె దీన్ని సాధించింది.
సెమీస్‌లో ఓడి కాంస్యం కోసం బరిలో దిగిన అంతిమ్ 9-1తో అండర్-23 ప్రపంచ ఛాంపియన్ ఎమ్మా జోనా (స్వీడన్)పై విజయం సాధించింది.
ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే.