అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ప్రస్తుత ఫిడే అధ్యక్షుడు అర్కాది ద్వొర్కోవిచ్‌ను యూరోపియన్ యూనియన్ నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చింది. దీంతో అతడు బాధ్యతల నుంచి వైదొలిగాడు.