రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది. 2030 క్రీడలను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని కామన్వెల్త్ స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు 2025, అక్టోబరు 15న సిఫారసు చేసింది. నవంబరు 26న జరిగే సర్వసభ్య సమావేశంలో ఆతిథ్య హక్కులపై లాంఛనంగా తుది నిర్ణయం తీసుకుంటారు. కామన్వెల్త్ స్పోర్ట్‌ను గతంలో కామన్వెల్త్ క్రీడల సమాఖ్య అని పిలిచేవాళ్లు. ఈ క్రీడలకు 2030లో వందేళ్లు పూర్తి కానుంది. భారత్ గతంలో 2010లో దిల్లీలో ఈ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చింది.