ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జీవాంజి దీప్తి బంగారు పతకం నెగ్గింది. 2025, అక్టోబరు 12న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన టీ20 మహిళల 400 మీటర్ల పరుగును 55.92 సెకన్లలో ముగించిన దీప్తి అగ్రస్థానం సాధించింది. కరీనా పెయిమ్ (పోర్చుగల్) రజతం, తెలాయా బ్లాక్‌స్మిత్ (ఆస్ట్రేలియా) కాంస్య పతకాలు గెలుచుకున్నారు.