2025, అక్టోబరు 5న ప్రకటించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2025-27 డబ్ల్యూటీసీ చక్రంలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన భారత్.. మూడింట్లో గెలిచి, రెండు ఓడింది. ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుని 55.56 విజయాల శాతంతో 40 పాయింట్లు సాధించింది.
ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఆస్ట్రేలియా 100 శాతంతో 36 పాయింట్లు గెలుచుకుని అగ్రస్థానంలో ఉంది.