ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీలు 2025, అక్టోబరు 5న ముగిశాయి. చివరి రోజు మూడు రజతాలు, ఒక కాంస్యంతో భారత్ పోటీలను ఘనంగా ముగించింది. నవ్‌దీప్ సింగ్ (జావెలిన్‌త్రో), ప్రీతి పాల్ (100 మీటర్లు), సిమ్రన్ (200 మీటర్లు) వెండి పతకాలు గెలవగా.. సందీప్ (200 మీటర్లు) కంచు కైవసం చేసుకున్నాడు.
భారత్ 22 పతకాలతో (6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు) పదో స్థానంలో నిలిచింది.