ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో భారత అథ్లెట్లు నిషాద్ కుమార్, సిమ్రన్ శర్మ పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. 2025, అక్టోబరు 3న దిల్లీలో జరిగిన పురుషుల టీ47 హైజంప్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిషాద్ 2.14 మీటర్ల జంప్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. 2019 ప్రపంచ పారా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2023 టోర్నీలో రజతం నెగ్గిన అతడు.. 2020, 2024 పారాలింపిక్స్‌లో కాంస్యం గెలిచాడు.
మహిళల టీ12 100 మీటర్ల పరుగులో సిమ్రన్ 11.95 సెకన్లలో రేసు పూర్తి చేసి పసిడి కైవసం చేసుకుంది. 2024 పారాలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన ఆమె.. గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం గెలిచింది.