భారత చెస్ స్టార్ వైశాలి ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2025, సెప్టెంబరు 15న సమర్‌కండ్ (ఉజ్బెకిస్థాన్)లో జరిగిన మ్యాచ్‌లో తాన్ జ్యోంగి (చైనా)తో ఆఖరిదైన 11వ రౌండ్‌ను డ్రాగా ముగించిన వైశాలి.. 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఆమె వరుసగా రెండో ఏడాది స్విస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది.