బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్ పోస్టు విధానాన్ని తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. వాల్యూయాడెడ్ సర్వీసుగా స్పీడ్ పోస్టు కిందే ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్‌ను రూపొందించింది. ఓటీపీ ఆధారిత డెలివరీ అనే కొత్త సర్వీసును తీసుకొచ్చింది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇవి అమల్లోకి రానున్నాయి. రిజిస్టర్ పోస్టులో ఎవరి పేరుతో అయితే మనం పంపామో వారికే పోస్టుమన్ ఉత్తరాన్ని ఇచ్చి సంతకం తీసుకుంటారు. ఈ సేవ కోసం నిర్దేశిత టారిఫ్‌కు అదనంగా ఒక్కో ఆర్టికల్‌కు జీఎస్టీ కాకుండా రూ.5 చెల్లించాలి.